చిన్నారులు మృతిపై స్పందించిన సీఎం

KRNL: చిగిలిలో నీటిలో పడి ఆరుగురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి తీరని విషాదమని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా వారికి సహాయం అందిస్తుందని 'X' వేదికగా సీఎం హామీ ఇచ్చారు.