కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల నిరసన

కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల నిరసన

JN: జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సోమవారం ధర్నా చేపట్టారు. ప్రీ-ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, ఏఫ్ ఆర్ ఎస్ వ్యవస్థను రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రూ. 18,000 వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.