కోళ్ల పరిశ్రమకు తాళం వేసి నిరసన

కోళ్ల పరిశ్రమకు తాళం వేసి నిరసన

MDK: శివ్వంపేట మండలం పోతుల బొగుడ గ్రామంలో సుగుణ కోళ్ల పరిశ్రమ ఎదుట గ్రామస్థులు బుధవారం ధర్నా నిర్వహించారు. పౌల్ట్రీ వ్యర్థాలతో నీటి కలుషితం, దుర్వాసనతో పిల్లలు వాంతులు, విరేచనాలతో బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరిశ్రమకు తాళం వేసి నిరసన తెలిపారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించలేదని, కలెక్టర్ తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.