మహాశివరాత్రి పూజల్లో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే
NDL: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని డోన్ పట్టణంలోని పాత బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించి నియోజకవర్గ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి కోసం ప్రార్థించారు.