రూ 2.81 కోట్లతో నూతన సబ్ స్టేషన్ మంజూరు

రూ 2.81 కోట్లతో నూతన సబ్ స్టేషన్ మంజూరు

SRCL: రూ 2.81 కోట్లతో సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డు పక్కన నూతన సబ్ స్టేషన్ మంజూరు అయిందని సిరిసిల్ల సూపరిండెంట్ బిక్షపతి తెలిపారు. సిరిసిల్లలోని విద్యుత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సబ్ స్టేషన్‌తో బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల గ్రామాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించవచ్చని, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ సబ్ స్టేషన్‌ను మంజూరు చేశారని పేర్కొన్నారు.