ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేష్

ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేష్

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించడంపై ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్‌లోని PM కార్యాలయానికి వెళ్లి మోదీని కలిసిన లోకేష్.. ఈ సందర్భంగా ఆయనను మంగళగిరి శాలువాతో సత్కరించారు. బిల్లు ఆమోదంపై లోకేష్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. అనంతరం కూటమి MPలతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.