అనుమానిత ఉగ్రవాది అరెస్ట్

అనుమానిత ఉగ్రవాది అరెస్ట్

TG: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో అనుమానిత ఉగ్రవాది NIA అధికారులకు పట్టుబడటం కలకలం రేపింది. స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఎన్‌ఐఏ, పటియాలా పోలీసులు.. ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పటియాలాకు తరలించారు.