'అనుదీప్ మృతిపై విచారణ చేపట్టాలి'

'అనుదీప్ మృతిపై విచారణ చేపట్టాలి'

ఏలూరు జిల్లా చాట్రాయి గ్రామంలో అంబటి అనుదీప్ పది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏలూరు నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్‌ను సోమవారం కలిసి హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అలాగే ప్రత్యేక అధికారులతో విచారణ చేయించాలని కోరారు.