ఘనంగా AISF ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

SDPT: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 90వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో AISF జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. విద్యార్థి హక్కుల కోసం, సమాజ మార్పు కోసం AISF పోరాటం కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.