రైలు ప్రయాణికులకు గమనిక

రైలు ప్రయాణికులకు గమనిక

కృష్ణా: ట్రాక్ నిర్వహణ కారణంగా మచిలీపట్నం, భీమవరం నుంచి విజయవాడ వచ్చే పలు రైళ్లు జులై 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు రామవరప్పాడు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. మచిలీపట్నం, భీమవరం వైపు వెళ్లే ఈ రైళ్లు విజయవాడకు బదులుగా రామవరప్పాడు నుంచి బయలుదేరుతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు గమ్యస్థానంలో మార్పును గమనించాలని సూచించారు.