BREAKING: మాజీమంత్రిపై లుకౌట్ నోటీసులు

AP: మాజీమంత్రి కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్ విడుదలైంది. దేశంలోని ఎయిర్పోర్టులు, పోర్టులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవల ముంబైలో కొడాలి నానికి గుండె ఆపరేషన్ జరిగింది. అమెరికా వెళ్తారన్న అనుమానంతో ఆన్లైన్ ద్వారా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.