నేటి నుంచి గ్రూప్-3 సర్టిఫికేట్ వెరిఫికేషన్
TG: ఇవాళ్టి నుంచి గ్రూప్-3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. ఈ రోజు నుంచి ఈనెల 26 వరకు నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో ఎంపికైన అభ్యర్థుల పత్రాలను పరిశీలించనున్నట్లు TGPSC తెలిపింది. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని, ఒరిజినల్ సర్టిఫికేట్‌లను తప్పనిసరిగా తీసుకురావాలని కమిషన్ కార్యదర్శి ప్రియాంక సూచించారు.