ఉపాధ్యాయ సంఘ నేతలతో డీఈవో సమావేశం

ప్రకాశం జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నేతలతో శనివారం డీఈవో కిరణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఒంగోలులోని సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలు, జీవో 117కు ప్రత్యామ్నాయ విధానాలపై చర్చించారు. సీనియారిటీ జాబితాలపై డీఈవో ఉపాధ్యాయ సంఘాల నేతల అభిప్రాయాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.