ఇండియా కూటమి ఐక్యతపై బీజేపీ చీఫ్ విమర్శలు

TG: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో ఇండియా కూటమిలో ఐక్యత లేదని స్పష్టమైందంటూ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రొఫెసర్లకు జీతాలు లేవని, వర్సిటీలు అధ్వానంగా ఉన్నాయని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు తప్ప.. అమలు చేయరని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలనకు పక్షవాతం వచ్చిందంటూ ఎద్దేవా చేశారు.