గూడెం కొత్తవీధిలో 'రైతన్న మీకోసం'

గూడెం కొత్తవీధిలో 'రైతన్న మీకోసం'

ASR: గూడెం కొత్తవీధి మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ఈనెల 29 వరకూ రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఏవో డీ.గిరిబాబు తెలిపారు. సోమవారం అసరాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. రైతులకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు వివరాలు నమోదు చేసుకుంటామన్నారు.