గుడ్‌న్యూస్.. మరో 5 రైళ్లకు హాల్టింగ్

గుడ్‌న్యూస్.. మరో 5 రైళ్లకు హాల్టింగ్

TG: రైల్వే ప్రయాణికులకు అధికారులు తీపికబురు చెప్పారు. హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో మరో 5 రైళ్లకు హాల్టింగ్ కల్పించారు. ఈ మేరకు ఈ రోజు నుంచే రాజ్‌కోట్, పోర్‌బందర్, పద్మావతి, హుస్సేన్ సాగర్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి స్టేషన్‌లో ఆగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం, రద్దీ దృష్ట్యా ఈ సదుపాయం కల్పించారు.