దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి
BHNG: ఎమ్మార్పీఎస్ రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున భువనగిరి ఎమ్మెల్యే నివాసంలో దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. ప్రతి దళిత కుటుంబానికి అంబేద్కర్ అభయ హస్తం ద్వారా రూ.12 లక్షల ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని కోరారు.