ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా డాక్టర్ సుధాకర్

SKLM: ఆముదాలవలస పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ చాపర సుధాకర్ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ మెడికల్ కౌన్సిల్ కార్యాలయం నుంచి ఈ నియామకానికి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.