ఆటో వాహనదారులకు యూనిఫామ్ తప్పనిసరి: సీఐ
KDP: ఆటో వాహనదారులకు యూనిఫామ్ తప్పనిసరి అని ఒంటిమిట్ట సీఐ బాబు సూచించారు. ఆదివారం రాత్రి సిద్ధవటం మండలం భాకరాపేటలోని కడప-చెన్నై జాతీయ రహదారి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఆటో దారునికి యూనిఫామ్, ద్విచక్ర వాహనదారులకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచనలు అందించారు. అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.