ప్రతాప్‌కు మరోసారి ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు

WGL: కాశీబుగ్గకు చెందిన ప్రముఖ తెలుగు దినపత్రిక ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ అరుదైన ఘనత సాధించారు. వరుసగా ఐదోసారి రాష్ట్రస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా ఎంపికయ్యారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ నెల 19న హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు.