ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
AKP: నర్సీపట్నం శాఖ గ్రంధాలయంలో గ్రంధాలయాధికారి పీ.దమయంతి ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించారు. ముందుగా ఇందిరాగాంధీ, వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ, వల్లభాయ్ పటేల్ దేశానికి ఎన్నో సేవలు అందించారని గ్రంథాలయాధికారి కొనియాడారు.