విద్యార్థుల భవితే మా లక్ష్యం: మంత్రి సవిత
SS: నేటి బాలలే రేపటి పౌరులు అని మంత్రి సవిత అన్నారు. శుక్రవారం సోమందేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన ఉందని తెలిపారు. నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయుల చేత విద్యా బోధన అందిస్తున్నట్లు వెల్లడించారు.