ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ప్రకాశం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 42 దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైనట్టు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులకు అర్హులైన వారు ఏప్రిల్ 8 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు www.prakasam.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, దరఖాస్తులను చేసుకోవాలని తెలిపారు.