కలుపు మందు తాగి ఆశా వర్కర్ మృతి

కలుపు మందు తాగి ఆశా వర్కర్ మృతి

KMM: కలుపుమందు తాగి ఆశా వర్కర్ మృతి చెందిన సంఘటన సత్తుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలీలా.. అంబేద్కర్ నగర్‌కు చెందిన జొన్నలగడ్డ వెంకటమ్మ(35) అయ్యగారిపేట పరిధిలో ఆశా వర్కర్ గా పని చేస్తున్నారు. గత నెల 24న మనస్థాపానికి గురై కలుపు మందు తాగింది. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జిల్లా మంగళగిరికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.