ఐఐటీలో హాఫ్‌ మారథాన్‌

ఐఐటీలో హాఫ్‌ మారథాన్‌

హైదరాబాద్‌ ఐఐటీలో ప్రపంచ అథెటిక్స్‌లో కాంస్య పతక విజేత బానోత్‌ పావని ఇవాళ హాఫ్‌ మారథాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్‌ BCS మూర్తి మాట్లాడుతూ.. ప్రతి ఏటా శీతకాలంలో హాఫ్ మారథాన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాల ఆరోగ్యానికి నడక, పరుగు అనేది ఎంతో దోహదం చేస్తుందన్నారు. కాగా, ఇందులో 2,200 మంది పాల్గొన్నారు.