కౌలస్ నాల నుంచి బోర్గికి తాగునీటి సౌకర్యం
SRD: కంగ్టి మండలం బోర్గి గ్రామాన్ని ఖేడ్ మున్సిపల్ ఛైర్మన్ నాగేష్ శెట్కార్ నేడు సందర్శించారు. పక్కనే ఉన్న కౌలాస్ నాలా చింతలవాడి ప్రాంతం నుంచి బోర్గి గ్రామానికి MP సురేష్ శెట్కార్ కొత్త పైప్ లైన్ ద్వారా తాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నాగేష్ శెట్కార్ తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సమస్య తీరుస్తామన్నారు.