కోడెల పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వం విప్
SRCL: వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గ్రామంలోని శ్రీరాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కోడెలను పంపిణీ చేశారు. రాజన్న ఆలయాలలో స్వామివారికి కోడె కట్టే సంప్రదాయం దేశంలో ఎక్కడా లేదన్నారు. తిప్పాపూర్ గోశాలలో భక్తులు అర్పించిన కోడలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు.