VIDEO: మల్లప్పశల క్షేత్రంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

VIDEO: మల్లప్పశల క్షేత్రంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

ప్రకాశం: హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామంలోని మల్లప్పశల క్షేత్రంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. అంబా మల్లేశ్వరి స్వామి ఆలయ గర్భగుడిలోని విగ్రహాలను ధ్వంసం చేసి వెలుపల వేసిన దుండగులు, లోపల ఐదు అడుగుల గొయ్యి తవ్వారు. పక్కనే ఉన్న రంగనాయక స్వామి ఆలయ వెనుక నుంచి విగ్రహం కింది భాగం వరకూ 20 అడుగుల లోతు గొయ్యి తీశారని గ్రామస్థులు తెలిపారు.