ఓయూ హాస్టళ్లను సందర్శించిన వీసీ
HYD: ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కుమార్ మోలుగురం మంగళవారం ఇంజినీరింగ్ హాస్టళ్లను సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. భీమా హాస్టల్‌ను సందర్శించిన సందర్భంగా పెండింగ్‌లో కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.