'కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము'

ASF: సింగరేణి కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని INTUC ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం INTUC జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో బెల్లంపల్లి ఏరియా నుండి వారు పాల్గొన్నారు. లాభాల వాటాను చెల్లించేలా కృషి చేస్తామన్నారు.