రోలర్ స్కేటింగ్‌లో విశాఖ వాసి గోల్డ్ మెడల్
విశాఖలో జరుగుతున్న 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్‌లో నగర క్రీడాకారిణి శ్రీ సాహితి ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించింది. ఈ విజయంతో ఆమె పతకాల సంఖ్య 106కు చేరిందని కోచ్ ఆకుల పవన్ కుమార్ తెలిపారు. VMRDA శాప్ అందించిన ప్రోత్సాహం తమ విజయానికి బలమయ్యిందని సాహితి పేర్కొంది.