VIDEO: అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయిన బస్సు

VIDEO: అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయిన బస్సు

కడప-విజయవాడ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం తృటిలో భారీ ప్రమాదం తప్పింది. శాంతివనం సమీపంలో విజయవాడ నుంచి కడప వైపు వస్తున్న RTC బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నప్పటికీ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.