నేడు అందుబాటులో విద్యుత్ కౌంటర్లు
PLD: కారంపూడి రోడ్డులోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో ఆదివారం కూడా కరెంట్ బిల్లులు స్వీకరిస్తారని సహాయ గణాంకాధికారి ఎన్. నరసింహా తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ బిల్లులను కార్యాలయంలోని కౌంటర్ వద్ద చెల్లించవచ్చని ఆయన సూచించారు. సెలవు రోజైనప్పటికీ ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.