'ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి'

'ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి'

ASF: జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ హరిత అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పనులకు ఇసుక కొరత లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, డీఆర్వో, ఇతర అధికారులు పాల్గొన్నారు.