దేవరాపల్లిలో భూ వివాదంతో ఉద్రిక్తత
AKP: దేవరాపల్లిలో భూ వివాదం బుధవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాల అనుచరులు చేరుకోవడంతో ఎస్సై సత్యనారాయణ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమాచారం అందుకున్న ఎస్పీ తుహీన్ సిన్హా అదనపు బలగాలను మొహరించగా, డీఎస్పీ వచ్చి వర్గాలను బోధించి కోర్టు తీర్పు ఉన్న భూమిలో అడ్డంకులు కలిగించవద్దని సూచించారు.