మంత్రాలయంలో 10 ఆటోలు సీజ్

KRNL: మంత్రాలయం పుణ్య క్షేత్రంలో ట్రాఫిక్ సమస్యకు కారణమైన 10 ఆటోలను సీజ్ చేసి, యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ శివాంజల్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మంత్రాలయంలోని మహా ముఖద్వారం, ఆధ్యాత్మిక కేంద్రం, రాఘవేంద్ర సర్కిల్, తదితర ప్రదేశాల్లో ఇష్టానుసారంగా నడుపుతున్న ఆటోలపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.