మక్కలు కొనేది ఎప్పుడు?... రైతన్న పడిగాపులు
KMR: రైతులు పండించిన మొక్కజొన్నను అధికారులు ఎప్పుడు కొంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 18 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అధికారులు ఆర్భాటంగా ప్రారంభించారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న కుప్పల వద్ద రాత్రి పగలు అనే తేడా లేకుండా పడిగాపులు కాస్తున్నారు.