గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు

గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు

PPM: గుమ్మలక్ష్మిపురం మండలం, దుడ్డుఖళ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వనకాబడి గ్రామంలో వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. భాస్కర రావు మంగళవారం తెలిపారు. ఈనెల 16న వనకాబడి గ్రామానికి చెందిన 10 మంది గ్రామస్తులు స్థానికంగా తయారు చేసిన జీలుగుకల్లు తాగడం వలన నలుగురికి డయేరియా, వాంతులు అయినట్లు చెప్పారు.