ఆక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయి స్వాధీనం
VZM: జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా విజయనగరం రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్స్‌లో సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన నలుగురు మహిళలు బరంపురం నుండి మహారాష్ట్రానికి రూ. 4లక్షలు విలువైన ఆక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ బాలాజీరావు గురువారం తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.