అప్పుల బాధ… యువతి ఆత్మహత్యాయత్నం

అప్పుల బాధ… యువతి ఆత్మహత్యాయత్నం

GDWL: గద్వాల పట్టణంలో ఇవాళ విషాద ఘటన జరిగింది. 7వ వార్డు దౌదర్‌పల్లిలో ఇందు (23), రామాంజనేయులు ఇటీవల హోమ్ లోన్ తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. కిస్తీలు చెల్లింపు విషయంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో ఇందు మనస్తాపానికి గురై సోమవారం గడ్డి మందు తాగింది. కుటుంబసభ్యులు ఆమెను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉంది.