అగ్నివీర్‌కు ఎంపికైన యువకులను సన్మానించిన కలెక్టర్

అగ్నివీర్‌కు ఎంపికైన యువకులను సన్మానించిన కలెక్టర్

WNP: యూనియన్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగం చేస్తూ వనపర్తి జిల్లాలోని యువతకు అగ్ని వీర్ ఉద్యోగాల్లో ఎంపిక అయ్యేవిధంగా ఉచిత శిక్షణ ఇస్తున్న మాజీ సైనికుడు గబ్బర్ సింగ్‌ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అభినందించారు. గురువారం కలెక్టర్ తన చాంబర్‌లో అగ్ని వీర్‌కు ఎంపికైన ఎనిమిది మంది యువకులను సన్మానించి అభినందించారు. శిక్షణ పొందిన సైనికులను కలెక్టర్ అభినందించారు.