VIDEO: వేగవంతంగా రహదారి విస్తరణ పనులు
కృష్ణా: గుడివాడ బాపయ్య చౌక్ వద్ద రహదారి విస్తరణ పనులు ఈరోజు వేగవంతంగా కొనసాగుతున్నాయి. పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం,పాదచారుల కోసం ఫుట్ పాత్ నిర్మాణం వంటి పనులు చేపట్టారు. పనులు పూర్తయిన అనంతరం వాహన రాకపోకల సులభతరమై ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.