VIDEO: అసంపూర్తిగా 'మన బడి నాడు-నేడు' పనులు
కృష్ణా: గుడివాడలో 'మన బడి నాడు-నేడు' రెండో విడత పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండేళ్లుగా ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంట సామాగ్రి మధ్యలో చదువుకునే దుస్థితి ఏర్పడింది. క్రికెట్ మ్యాచుల కోసం దేశాలు తిరగడం కాదు, ఇలాంటి స్కూళ్లకు వెళ్లండని YCP సోషల్ మీడియాలో పోస్టు చేసింది.