రాష్ట్రంలో అందరూ పేదోళ్లేనా: మంత్రి తుమ్మల

TG: రేషన్ కార్డులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్ముకునే వాళ్లకు రేషన్ బియ్యం ఎందుకు ఇవ్వాలంటూ ప్రజలను ప్రశ్నించారు. ఉచితాలు తగ్గించాలని, అందరికీ రేషన్ కార్డులు కావాలంటే ఎలా అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటే.. కోటి 25 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. అంటే రాష్ట్రంలో అందరూ పేదలేనా? అని అడిగారు.