మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన MLA

VZM: స్త్రీ ఆర్ధికంగా బలపడితే రాష్ట్రం బలపడుతుందని నమ్మే నాయకుడు చంద్రబాబు అని రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో 'స్త్రీ శక్తి పథకం'లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలతో పాటు బస్సులో ప్రయాణించారు.