కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర, గాజులు!

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర, గాజులు!

TG: వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఓ ట్రాన్స్‌జెండర్ చీర, గాజులు పంపించింది. కాంగ్రెస్ నేతలు చేసిన కబ్జాల వల్లే.. వరంగల్ నగరంలో వరదలు వచ్చాయని విమర్శించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి కమీషన్లకు అలవాటుపడ్డారని.. వారికి అభివృద్ధి చేయడం చేతకావట్లేదని మండిపడింది.