జూదం ఆడుతున్న 14 మంది అరెస్ట్

GNTR: తుళ్లూరు మండలం అనంతవరంలోని వెంకటేశ్వరస్వామి కొండ వెనుక మంగళవారం ఉదయం జూదం ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో 14 మంది జూదరులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 90,500 స్వాధీనం చేసుకున్నారు. తుళ్లూరు సీఐ-2 అంజియ్య ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.