చాకలిదానిగుట్ట తాండ 5వ వార్డు ఎన్నిక ఏకగ్రీవం

చాకలిదానిగుట్ట తాండ 5వ వార్డు ఎన్నిక ఏకగ్రీవం

RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చాకలి దాని గుట్ట గ్రామపంచాయతీ 5వ వార్డు సభ్యులుగా శాంతి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాంతి శ్రీనివాస్‌తో పాటు పలువురు నామినేషన్లు వేయగా, నిన్న మిగతావారు తమ నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో శాంతి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారు తెలిపారు.