చంపేస్తానని TTD ఉద్యోగినికి బెదిరింపులు

చంపేస్తానని TTD ఉద్యోగినికి బెదిరింపులు

TPT: అలిపిరి పోలీస్ స్టేషన్లో బెదిరింపుల కేసు నమోదైంది. ఎస్సై శ్రీవాణి వివరాల మేరకు.. వినాయక నగర్‌కు చెందిన మహిళ (34) TTDలో సిస్టం ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. భర్తతో విభేదాలు ఉన్న సమయంలో కల్లూరి హేమాద్రి ప్రెస్ రిపోర్టర్‌గా ఆమెతో పరిచయం చేసుకున్నాడు. అనంతరం సన్నిహితంగా ఉంటూ రూ.4 లక్షలు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వమన్నందుకు చంపేస్తానని బెదిరించినట్లు తెలిపారు.