ఉయ్యూరులో నవవధువు ఆత్మహత్య

కృష్ణా: కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన వర్రే శ్రీవిద్య (24) ఆదివారం తన ఇంటిలో ఉరి వేసుకుని మృతి చెందిందని తెలిపారు. ఐదు నెలల క్రితం కలాపాముల గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ అనే విలేజ్ సర్వేయర్‌ను వివాహం చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.